హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగకు భర్త వెళ్లొద్దన్నాడని భార్య ఆత్మహత్య

MNCL: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్ధలతో లావణ్య (32) మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. నస్పూర్ మండలం సుందరయ్య కాలనీలో నివాసముంటున్న లావణ్య 2 రోజుల క్రితం తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసి పండగకు ముందే పుట్టింటికి వస్తానని చెప్పింది. ఈ విషయం భర్తకు చెప్పగా అంగీకరించలేదు. దీంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.