హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయిజలో పాముకాటుతో మహిళ మృతి

GDWL: పత్తి చేనులో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో అయిజ మండలం పులికల్ గ్రామానికి చెందిన అంజనమ్మ (45) మంగళవారం మృతి చెందింది. ఉత్తనూర్ శివారులోని పొలంలో పత్తి ఏరుతుండగా ఈ ఘటన జరగడంతో తోటి కూలీలు వెంటనే ఆమెను అయిజ, అక్కడి నుంచి గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.