హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: లీడ్ బ్యాంకు మేనేజర్

NRML: నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ కోరారు. నిర్మల్ పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.