హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్కరోజులో 4 పుణ్యక్షేత్రాలు

 HYD: భక్తుల సౌకర్యార్థం ఒక్కరోజులో నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా టీజీఎస్ఆర్టీసీ దిల్‌సుఖ్‌నగర్ డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. అక్టోబర్ 3న రాత్రి బయలుదేరే ఈ యాత్రలో అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మతో పాటు పెనుగంచిప్రోలు తిరుపతమ్మను దర్శించుకోవచ్చు. ఈ బస్సు ప్రయాణ ఛార్జీ రూ.1,500గా నిర్ణయించారు.