హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా రహదారి.. ఇబ్బందుల్లో వాహనదారులు

VKB: పూడురు మండల పరిధిలోని చన్‌గోముల్-కంకల్ ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా బురదగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వాపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.