హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌జైలును సందర్శించిన న్యాయమూర్తి

BDK: ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ భద్రాచలం సబ్‌జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, భోజనం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. లీగల్‌ ఎయిడ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, జైలులో విద్యను అభ్యసించి సత్ప్రవర్తనతో మెరుగైన జీవితాన్ని గడపాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ ఉపేందర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.