హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముందస్తు అరెస్టులపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

కరీంనగర్: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న వేళ తమను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసించారు. ప్రజాపాలనలో విద్యార్థులంటే ప్రభుత్వానికి ఎందుకు భయమని వారు నిలదీశారు.