హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్‌ మోసాలపై పోలీసుల అవగాహన

BHPL: మొగుళ్లపల్లి మండలం రంగాపూర్‌లో సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో పోలీసులు కర్టన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 14 వాహనాలను సీజ్‌ చేశారు. అనంతరం యువతకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలు, సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల ఫోన్‌కాల్స్‌, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.