WGL: రాయపర్తి మండల కేంద్ర శివారులో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కూడలి దేవి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కార్లు అదుపుతప్పి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, 108లో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రెండు కార్ల ఢీ.. ఇద్దరికి గాయాలు


