హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల అభిమానం చూసి చలించిన మాజీ మంత్రి

MBNR: మహబూబ్‌నగర్‌లోని కాలనీల పర్యటనలో భాగంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఓ కాలనీకి వెళ్లారు. అక్కడి ఓ బాలిక ఆయనను ఆప్యాయంగా పలకరిస్తూ.. “మిమ్మల్ని నేను ఒకటో తరగతిలో చూశాను.. మళ్లీ ఇప్పుడు కనిపించారు” అని చెప్పింది. అనంతరం తన వెంట ఉన్న పిల్లలను తీసుకొచ్చి శ్రీనివాస్ గౌడ్‌ను పలకరించింది. చిన్నారుల అభిమానం చూసి మాజీ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.