హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతులు లేని వాటర్ ప్లాంట్లు సీజ్

JN: బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్లాంట్లను తనిఖీ చేసి మంగళవారం సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనుమతులు లేకుండా నీటి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.