VKB: తాండూరు మండలం జిన్‌గుర్తి గ్రామంలో పది సంవత్సరాల తర్వాత యాభై కుంటుబాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేశారు. ఇన్ని రోజుల తర్వాత గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ రావడం సంతోషకరంగా ఉందని సర్పంచ్ మడపతి శరణయ్య స్వామి వెల్లడించారు. అందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, ట్రాన్స్ కో ఏఈ పర్వాతాలు బృందానికి ఆయన మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పది సంవత్సరాల తర్వాత త్రీఫేజ్ విద్యుత్ సరఫరా


