హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ‘డయల్ యువర్ డీఎం' కార్యక్రమం

WGL: ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, సలహాలు సూచనలు స్వీకరించడానికి బుధవారం(నేడు) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు RTC వరంగల్-1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226047 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యలు చెప్పాలని డీఎం కోరారు.