హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాలా స్లాబ్ పనులు నాణ్యతతో చేపట్టాలి'

MBNR జడ్చర్ల మండలం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నాలా స్లాబ్ పనులు నాణ్యతతో చేపట్టాలని కాలనీవాసులు ఇరిగేషన్ అధికారులను కోరారు. నల్లకుంట నుంచి వచ్చే 12 అడుగుల నాలాలో రాళ్లు, చెత్త, మట్టి పేరుకుపోయాయని తెలిపారు. పూడిక తీయకుండానే స్లాబ్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మురుగునీరు ఇళ్లలోకి, ప్రధాన రోడ్డుపైకి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.