AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 77,082 మంది భక్తులు దర్శించుకోగా.. 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
శ్రీవారి దర్శనానికి 24 గంటలు


