హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసు.. ఐదేళ్ల జైలు శిక్ష

SRD: రామచంద్రపురం మండల పరిధిలోని బండ్లగూడకు చెందిన తలారి జగదీశ్‌కు పోక్సో కేసులో భాగంగా న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో తలారి జగదీశ్‌పై రాంచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నిందితున్ని దోషిగా తేల్చి జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.