MLG: వెంకటాపురం మండలంలో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని MPO బి.నారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మల్టీ పర్పస్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. తాగునీరు, వీధి దీపాల నిర్వహణపై సమీక్షించారు.
తెలంగాణ
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు: MPO


