హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కళాశాలల సంఘానికి కొత్త అధ్యక్షుడు

MLG: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పాలనాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏవో వైనాల నవీన్‌ను మంగళవారం ప్రిన్సిపల్ మల్లేశం, బోధన, బోధనేతర సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని రూసా కార్యాలయంలో ఎన్నిక జరిగింది. 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలందించిన నవీన్, కళాశాలల బలోపేతానికి కృషి చేస్తానన్నారు.