హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎస్సారెస్పీకి స్వల్ప వరద

JGL: ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 1,157 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,157 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 46.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 56.644 టీఎంసీలు ఉండగా, ఈసారి నిల్వ తక్కువగా ఉంది. లక్ష్మీకెనాల్‌కు 215, అలీసాగర్‌కు 540, సరస్వతికి 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.