హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత సంఘం ఎన్నికల్లో విజయకుమార్‌ ప్యానెల్‌ విజయం

MBNR: ధన్వాడ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ఎర్రగుంట్ల విజయకుమార్‌ ప్యానెల్‌ ఘనవిజయం సాధించింది. విజయకుమార్‌తోపాటు కించె నరసింహ, జయప్రకాష్‌, చంద్రశేఖర్‌, నాగార్జున, నారాయణ, బాల్రాజ్‌, మల్లీశ్వరి, చంద్రకళ డైరెక్టర్లుగా గెలిచారు. తొమ్మిది మంది అత్యధిక మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. విజేతలను పద్మశాలి సంఘం అధ్యక్షుడు, సభ్యులు సత్కరించారు.