హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన

MLG: వెంకటాపూర్ మండలం కేశవాపూర్‌లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో పత్తి క్షేత్ర ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి శైలజ పంటలను పరిశీలించి ఎరువులు, సూక్ష్మపోషకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. గులాబీ రంగు కాయతొలుచు పురుగు, చీడపీడలను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.