హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ కీలక నిర్ణయాలు

JGL : జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన సెప్టెంబర్ నెల కౌన్సిల్ సమావేశం జరిగింది. పట్టణంలో సీసీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌కు రూ.50 లక్షలు, బతుకమ్మ, దసరా ఏర్పాట్లు, శానిటేషన్ వాహనాల మరమ్మతులకు రూ.4 లక్షలు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. మున్సిపల్ షాపుల టెండర్లు, భూముల వినియోగ మార్పు ప్రతిపాదనలపై చర్చించారు.