హైదరాబాద్: 28°C
తెలంగాణ

పటాన్‌చెరు అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఎద్దడి లేకుండా కొత్త బోర్లు వేయాలని, వారానికోసారి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. CSR నిధులతో స్వీపింగ్ మెషీన్లు, టిప్పర్లు అందుబాటులోకి తెస్తున్నామన్న ఆయన.. వీధిదీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.