హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ పేరుతో మోసం

HYD: క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1,03,537లు కాజేశారు. MRC కాలనీకి చెందిన హరినారాయణ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు అధికారులమని పరిచయం చేసుకున్నారు. ప్రాసెసింగ్ కోసం OTP అవసరమని నమ్మించి ఆయన నుంచి ఓటీపీ పొంది రూ.1,03,537 కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.