హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏపీకే ఫైల్ పంపి.. రూ.1.49 లక్షలు స్వాహా!

HYD: నకిలీ 'ఆర్టీవో చలాన్ ఏపీకే' ఫైల్ ద్వారా ఒక పోలీస్ అధికారి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. బంజారాహిల్స్ ఐసీసీసీలో ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్సైగా పనిచేస్తున్న కోట్ల జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో ఈ యాప్‌ను ఉపయోగించగా, ఈ నెల 26, 27 తేదీల్లో ఆయన ఖాతా నుంచి రూ.1,49,799 డెబిట్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.