హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగారక చతుర్థి సందర్భంగా భారీగా భక్తులు

SRD : రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో అంగారక చతుర్థి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని సింధూర వర్ణంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.