హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

NZB: కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అంజయ్య భవన్‌లోని కార్మిక సంక్షేమ బోర్డు కమిషనర్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ ‘మహా మేస్త్రి’ మర్లు సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు ధర్పల్లి చంద్రంతో కలిసి కమిషనర్‌ను మంగళవారం సాయంత్రం కలిశారు.