KMM: పెనుబల్లి మండలం కొండ్రపాడులో బెల్ట్‌షాపు నిర్వహణ కోసం మంగళవారం వేలంపాట నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలోనే వేలం నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్‌షాపు నిర్వహణకు పోటీ ఉండటంతో వేలం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించిన వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆలయంలో బెల్ట్‌షాపు వేలం.. స్థానికుల అభ్యంతరం


