JN: చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో స్నానపు గదిలో ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందారు. ఎర్ర మల్లయ్య (82) స్నానపు గదిలో జారిపడి తీవ్రంగా గాయపడటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై నవీన్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బాత్‌రూమ్‌లో జారిపడి వృద్ధుడు మృతి


