హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం-భద్రాచలం బస్ ఛార్జీ తగ్గింపు

KMM: ఖమ్మం నుంచి సత్తుపల్లి, భద్రాచలం వెళ్లే డీలక్స్ బస్ సర్వీసులకు బుధవారం నుంచి ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయని డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఖమ్మం-భద్రాచలం ఛార్జీ రూ.180 నుంచి రూ.170కి, ఖమ్మం-సత్తుపల్లి రూ.130 నుంచి రూ.120కి తగ్గించినట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి బస్ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.