హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నాగరాజుని మంగళవారం ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించి రూ.22 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. ప్రమాదంలో గాయపడి కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.