హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్‌పాస్‌లలో నీటి కష్టాలు

BHNG: రామన్నపేట మండల గ్రామాల రహదారుల్లో రైల్వే అండర్‌పాస్‌లు వర్షాకాలంలో ఇబ్బందికరంగా మారాయి. చిరుజల్లులు కురిసినా నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రామన్నపేట–సిరిపురం, ఇంద్రపాలనగరం–వెల్లంకి మార్గాల్లో వర్షాలకు నీరు నిలుస్తోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.