హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాత్రి వేళలో పశువుల సంచారం.. భయం.. భయంగా!

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాత్రి వేళ పశువులు రోడ్డుపై సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లో పశువులు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.