హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభానికి సిద్ధమైన కలెక్టరేట్ భవనం

కరీంనగర్ నగరంలోని కొత్త కలెక్టరేట్ భవనం పండుగ వాతావరణాన్ని తలపించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో కలెక్టర్ చిత్రా మిశ్రా, అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టరేట్‌ను విద్యుత్ కాంతులు, బంతిపూల తోరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో భవనం ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తుంది.