హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్ స్టేషన్‌లో గంజాయి పట్టివేత

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 15.426 కేజీల గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ తనిఖీల్లో ప్లాట్‌ఫామ్ నంబర్ 10పై అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు రావడాన్ని గమనించిన నిందితులు బ్యాగులను అక్కడే వదిలి పరారైనట్లు గుర్తించారు.