హైదరాబాద్: 28°C
తెలంగాణ

33 కేవీ కొత్త విద్యుత్ లైన్ ప్రారంభం

HNK: భీమారం ఓఆర్ఆర్ వంతెన నుంచి దేవన్నపేట సబ్‌స్టేషన్ వరకు 3.5 కి.మీ మేర ఏర్పాటు చేసిన 33 కేవీ కొత్త విద్యుత్ లైన్‌ను HNK ఎస్ఈ భూక్య సామ్యా నాయక్ మంగళవారం ప్రారంభించారు. రూ.60 లక్షలతో నిర్మించిన ఈ లైన్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయంలో ప్రత్యామ్నాయ సరఫరా అందించనున్నారు. కార్యక్రమంలో డీఈ మల్లికార్జున్, ఏడీఈ అశోక్, ఏఈ సత్యనారాయణ, లైన్‌మెన్ రవీందర్ పాల్గొన్నారు.