హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటన

కాకినాడ: ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన తిమ్మాపురం, పండూరు గ్రామాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులతో కలిసి మంగళవారం పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. వరద నీటిని త్వరగా తొలగించేందుకు జేసీబీలతో చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.