హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు అందజేత

విశాఖ పశ్చిమ నియోజకవర్గం ములగాడ మండలంలో మంగళవారం 'పేదలకు పట్టాభిషేకం-బాబు హామీ మీ చేతికే మీ భూమి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు హాజరై, లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పత్రాలు భవిష్యత్తులో రుణాలు, విద్య, కుటుంబ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.