హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రవాదుల ఆకస్మిక కాల్పులు.. జవాన్ మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్ జిల్లాలో భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు మెరుపు దాడి జరిపారు. ఈ కాల్పుల్లో 21వ అస్సాం రైఫిల్స్ హవిల్దార్ జాంఖోకై కుకి వీరమరణం పొందగా, మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. అయితే, ఈ దాడి వెనుక NSCN ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్న బలగాలు, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకొని గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.