హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ నేత దౌల మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

కృష్ణా: తోట్లవల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ మైనారిటీ నాయకుడు ఎంఎం దౌల పార్థివదేహానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి ఘన నివాళులర్పించారు. పార్టీ తరఫున గౌరవ సూచకంగా టీడీపీ జెండాను పార్థివదేహంపై కప్పి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.