హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన సంక్షేమంపై సుదీర్ఘ సమీక్ష

PPM: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆమె సీతంపేట ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పథకాలు, నిధులు అర్హులైన వారికి పారదర్శకంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.