SKLM: ఇచ్చాపురం నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో భేటీ అయ్యారు. బారువ సీహెచ్‌సీ, సోంపేట డయాలసిస్ కేంద్రం వద్ద డ్రైనేజీ, మురుగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలో పెండింగ్ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ


