హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

NTR: ఏ.కొండూరు మండలంలో పల్లె పండుగ–3.0లో భాగంగా రూ.2.16 కోట్లతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.