హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగారక చతుర్థి హోమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్

KNR: కరీంనగర్‌లోని శ్రీ మహా శక్తి దేవాలయంలో అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా నిర్వహించిన విశేష హోమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశేషంగా పూజలు చేశారు.