హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్, ఒకరు మృతి

NLR: రాపూరు(M) సిద్ధవరం గ్రామం సమీపంలోని బండేపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బండేపల్లి గ్రామం వద్ద బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది. చల్లటూరుకి చెందిన శివారెడ్డి (35) మృతి చెందారు. తాటిపల్లికి చెందిన గోపాల్ (68) గాయపడ్డట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.