హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కల సంరక్షణలో చేయూత ఫౌండేషన్

గుంటూరు నగర ఎకో పార్కులో నాటిన వెయ్యి మొక్కల సంరక్షణ బాధ్యతను చేయూత ఫౌండేషన్ చేపట్టింది. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల సహకారంతో మొక్కలకు నీరు, పాదులు, కర్రల ఏర్పాటు, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కల నాటకం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని చెట్లుగా పెంచే బాధ్యత తీసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.