హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్ ఆస్పత్రి ఎదుట ధర్నా

SRD: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన శేఖర్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని వారు ఆరోపించారు. ఓ కేసు విచారణ పేరుతో జహీరాబాద్ పట్టణ పోలీసులు శేఖర్‌ను విచక్షణారహితంగా కొట్టారని, దీంతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.