ASF: జైనూర్ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ హరిత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తనకు ఫిర్యాదు చేయవచ్చని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'


