హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటుహక్కు ఎంతో విలువైనది: మాజీ మంత్రి

MBNR: పట్టభద్రులందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంగళవారం తన కూతుళ్లు శ్రీహిత, శ్రీహర్షితలతో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా తన పేరు నమోదు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో విలువైనదని, అర్హులైన పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.