హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

​బాపట్ల మండలంలోని నాగరాజు కాలువలో దూకి గల్లంతైన యువకుడి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి రామ సిద్ధార్థ ఆధ్వర్యంలో పోలీసు, అగ్నిమాపక సిబ్బంది రెండు బోట్ల సహాయంతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.